జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 2026 లో ఏర్పడే తొలి సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువుగా ఉంటుందని చెబుతున్నారు.సూర్యగ్రహణం తర్వాత. స్నానం చేసి మీ రాశిని బట్టి కొన్ని వస్తువులను దానం చేయాలని పండితులు చెబుతున్నారు.. ఇప్పుడు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
ఖగోళ శాస్త్రవేత్తలు. . జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం 2026 ఫిబ్రవరి 17న ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. శని మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో మధ్యాహ్నం 3:26 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7:57 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం చెల్లదు. అయితే దీని ప్రభావం 12 రాశుల వారిపై ఏదో ఒక విధంగా ఉంటుంది. సూర్య గ్రహణం సమయంలో చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు కుంభరాశిలోనే ఉంటారు.. ఈ కారణంగా ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది.
సూర్యగ్రహణంతో జాతకంలో వచ్చే చెడు ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి రాశుల వారీగా కొన్ని వస్తువులను దానం చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివలన జాతకంలోని అశుభ ప్రభావాలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ చర్యలను పాటించడం కచ్చితంగా ద్వాదశ రాశుల వారికి మేలు చేస్తుందని పండితులు చెబుతున్నారు.
మేషరాశి: ఈ రాశి వారికి అంగారాకుడు అధిపతి. ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత ధాన్యాలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు, గోధుమలు, పప్పులు, గంధం, మొదలైన వాటిని దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: ఈరాశి వారికి శుక్రుడు అధిపతి. సూర్యగ్రహం వీడిన తరువాత పాలు, పెరుగు, తెల్లటి వస్త్రాలు, చక్కెర, అన్నం, కర్పూరం , మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే వీరికి అన్నింటా అనుకూల ఫలితాలు వస్తాయి.
మిథున రాశి: ఈ రాశి వారు సూర్యగ్రహణం వీడిన తరువాత స్నానం చేసి ఆవుకు పచ్చి మేత తినిపించాలి. ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ బట్టలు, పెసర పప్పు, ఇత్తడి పాత్రలు, విద్యార్థులకు పుస్తకాలు మొదలైనవి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి: సూర్యగ్రహణం తర్వాత ఈ రాశి వారు బ్రాహ్మణుడికి ముత్యాలు, తెల్లని వస్త్రాలు, పంచదార, బియ్యం, వెండి, పాలు లేదా పాలతో చేసిన స్వీట్లను దానం చేయాలి. ఇలా చేస్తే వీరికి డబ్బుకు ఢోకా ఉండదు.
సింహ రాశి: ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాతగోధుమలు, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేయడం సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత ఆవుకు పచ్చి మేత, పెసరపప్పు, ఉలవలు, పచ్చి కూరగాయలు, చదువుకునే వారికి పుస్తకాలు మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వలన అన్ని విషయాల్లో మేలు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
తులా రాశి: ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత తెల్లటి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, మొదలగు వస్తువులను దానం చేయాలి. ఎందుకంటే ఈ రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు. దీంతో.. వీరికి అన్నింటా విజయం కలుగుతుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.
వృశ్చికరాశి: ఈ రాశికి అధిపతి కుజుడు. సూర్యగ్రహణం తర్వాత ఈ రాశికి చెందిన వారు ఎర్రటి ధాన్యాలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు, రాగి నాణాలు మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే వీరికి అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశివారు పప్పు, శనగపిండి, బెల్లం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం లభిస్తుంది.
మకర రాశి: ఈ రాశికి అధిపతి శని. ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత గొడుగు, దువ్వెన, నలుపు లేదా నీలం రంగు బట్టలు, ఆవాల నూనె, నువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే అదృష్టం క్యూ కడుతుందని పండితులు చెబుతున్నారు
కుంభరాశి: ఇదే రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ రాశిని శని పరిపాలిస్తాడు. ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత గొడుగు, దువ్వెన, నలుపు లేదా నీలం రంగు బట్టలు, ఆవాల నూనె, నువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి.
మీనరాశి: ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత బెల్లం, శనగపప్పు, పసుపు బట్టలు మొదలైన వాటిని తప్పనిసరిగా దానం చేయాలి. ఈ రాశిని పాలించే గ్రహం బృహస్పతి. ఇలా చేయడం వల్ల సకల పనుల్లో విజయం వీరి సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
